ట్విట్టర్​లో కొత్త ఫీచర్‌ !

Telugu Lo Computer
0


ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా మార్చే లక్ష్యంతో వార్నింగ్ లేబుల్​ను జోడించింది. ఈ కొత్త ఫీచర్​ ద్వారా అభ్యంతరకరంగా పోస్టులు, ఫోటోలు, వీడియోలకు వార్నింగ్​ లేబుల్ యాడ్​ చేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా అభ్యంతకర ట్వీట్లను సెన్సిటివ్‌గా ఫ్లాగ్ చేయడానికి ట్విట్టర్​ అనుమతిస్తుంది. ఇలా పెట్టడం ద్వారా ఆ పోస్టుపై అభ్యంతరాలను ట్విట్టర్​కు నివేదించవచ్చు. తద్వారా, ట్విట్టర్​ ఆ పోస్టును డిలీట్​ చేయడం లేదా అలెర్ట్ చేయడం వంటివి చేస్తుంది. అంతేకాదు, మనం చూడబోయే వీడియో లేదా పోస్ట్​కు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ముందుగానే తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఈ తరహా ఫీచర్​ ఫేస్​బుక్​ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్​ ఫేస్​బుక్​ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. దీంతో, ఇప్పుడు ఈ ఫీచర్​ను ట్విట్టర్​ సైతం తీసుకొచ్చింది. ఈ ఫీచర్​ సహాయంతో యూజర్​ ట్వీట్​కు ఫోటో లేదా వీడియోను యాడ్​ చేసే సమయంలో.. పైన ఉండే మూడు చుక్కలను క్లిక్​ చేస్తే ఎడిట్​ ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేస్తే చివర్లో ఫ్లాగ్​ ఐకాన్​ కనిపిస్తుంది. అందులో న్యూడిటీ (అశ్లీలత), వయోలెన్స్, సెన్సిటివ్​ అనే మూడు కేటగిరీలు ఉంటాయి. యూజర్​ పోస్ట్​ చేసే ఫోటో/ వీడియో పైన పేర్కొన్న మూడు కేటగిరీల్లో దేని కిందికి వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని పోస్ట్​ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ట్వీట్ చూసే యూజర్లు ఆ పోస్ట్​ ఎలాంటిదన్న విషయం ముందుగానే తెలుసుకోవచ్చు. ఒకవేళ, యూజర్​ సదరు ఫైల్​ను చూడాలనుకుంటే దాని మీద కనిపించే షో బటన్​ను క్లిక్​ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూజర్​కు కంటెంట్ వార్నింగ్​ లేబుల్​ మెసేజ్​ కనిపిస్తుంది. ఈ వార్నింగ్ లేబుల్​ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్​, వెబ్‌ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్​ ద్వారా సున్నితమైన లేదా NSFW ఫోటో లేదా వీడియోపై కంటెంట్ హెచ్చరికను జోడించవచ్చు. వినియోగదారులు ట్విట్టర్​లో ఫోటో లేదా వీడియోను ఎడిట్​ చేసే క్రమంలో ఫ్లాగ్ సింబల్​ను నొక్కడం ద్వారా పోస్టుపై ఉన్న అభ్యంతరాన్ని తెలియజేయవచ్చు. యూజర్లు పోస్ట్​ చేసే ముందే అది ఏ రకమైన కేటగిరీకి చెందిందో సెలక్ట్ చేసుకోవాలి. తద్వారా పోస్టును ఓపెన్​ చేసే యూజర్​కు సదరు పోస్ట్​ దేనికి సంబంధించిందనే విషయంపై క్లారిటీ ఉంటుంది. ఈ ఫీచర్​ ఇప్పటికే వెబ్​, మొబైల్ యాప్‌లో లైవ్​లోకి వచ్చింది. అయితే, వార్నింగ్ లేబుల్​ను ఉపయోగించుకోవడం వినియోగదారు ఇన్‌పుట్‌పై ఆధారపడి ఉంటుంది. దీన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఆప్షన్​ మాత్రమే.

Post a Comment

0Comments

Post a Comment (0)