అంతర్జాతీయ వైమానిక సేవలు తిరిగి ప్రారంభం

Telugu Lo Computer
0


అంతర్జాతీయ వైమానిక సేవలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందుల్లో పడిన వైమానిక రంగం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ సేవలు పునఃప్రారంభమవడంతో ఈ రంగం నిలదొక్కుకోవడానికి అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి విదేశీ ప్రయాణాలు ఊపందుకుంటాయని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ అంతర్జాతీయ సేవలకు భారతీయ వైమానిక సంస్థలు సిద్దమవుతున్నాయి. అదేవిధంగా ఎమిరేట్స్, వర్జిన్ అట్లాంటిక్, LOT Polish వంటి విదేశీ వైమానిక సంస్థలు కూడా భారత దేశం నుంచి/భారత దేశానికి వైమానిక సేవలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలను ప్రకటించాయి. 40 దేశాల నుంచి 60 ఎయిర్‌లైన్స్ విమానాలను భారత దేశానికి నడిపేందుకు అనుమతి ఉంది. మార్చి 27 నుంచి అక్టోబరు 29 వరకు సమ్మర్ షెడ్యూలులో భారత దేశం నుంచి, భారత దేశానికి 1,783 ఫ్రీక్వెన్సీలను నడిపేందుకు అనుమతి ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. సమ్మర్ షెడ్యూలులో వారానికి 1,466 ఇంటర్నేషనల్ డిపార్చర్స్‌ చొప్పున నడిపేందుకు ఆరు ఇండియన్ క్యారియర్స్‌కు అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. ఇవి 27 దేశాల్లోని 43 గమ్యస్థానాలకు ఈ విమానాలను నడుపుతాయని తెలిపింది. షెడ్యూల్డు ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ఫ్లైట్స్‌ సేవలను 2020 మార్చి 23 నుంచి నిలిపేసిన సంగతి తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)