ప్రధానితో పంజాబ్ సీఎం భేటీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 24 March 2022

ప్రధానితో పంజాబ్ సీఎం భేటీ


పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం భగవంత్ మాన్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వచ్చిన ఆయన ప్రధాన మంత్రి కార్యాలయానికి వెళ్లి  నరేంద్ర మోదీని కలుసుకున్నారు. కేంద్రం నుంచి అందాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మోదీ హామీనిచ్చారు. మర్యాద పూర్వకంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రధానిని కలిశారు. మోదీతో భేటీ అనంతరం ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కే్జ్రీవాల్ ను కూడా కలువనున్నారు. ఈనెల 16న భగత్‌సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో పంజాబ్‌ సీఎంగా భగవంత్ మాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు కొనసాగిన ఆయన ప్రస్థానంలో ఎన్నో పరాజయాలు.. మరెన్నో విజయాలు ఉన్నాయి. అయితే ఓటములకు కుంగిపోని ఆయన.. గెలుపుతోనే విమర్శకులకు సమాధానం చెప్పారు. భగవంత్ మాన్ 1972 అక్టోబర్ 17న పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా సతోజ్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి ఉపాధ్యాయుడు.

No comments:

Post a Comment