257మంది దగ్గర రూ.226కోట్లకు పైగా సంపద ?

Telugu Lo Computer
0


కోల్‌కతా మహానగరంలో ధనికుల జాబితా మరింత పెరిగేలా ఉందని రికార్డులు చెబుతున్నాయి. 2026 నాటికి 43.2 శాతం పెరిగి 368మందికి చేరుకుంటుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం కోల్‌కతాలో అల్ట్రా హై నెట్ వర్త్ ఉన్న వ్యక్తుల సంఖ్య 2016లో 119 ఉండగా అది 2021 నాటికి 251కి చేరిందని నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2022లో వెల్లడించింది. ముంబైలో వెయ్యి 596 మంది అల్ట్రా రిచ్ పర్సన్స్ ఉండగా తర్వాత హైదరాబాద్‌లో 467 మంది ఉన్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ జనాభాలో భారతదేశం మూడో స్థానంలో నిలిచింది. అంతకంటే ముందు వరుసల్లో 748 మంది బిలియనీర్లతో US మొదటి స్థానంలో, 554 బిలియనీర్లతో చైనా ప్రధాన భూభాగం రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో 145 బిలియనీర్లతో మూడో స్థానంలో నిలిచింది. భారతీయ నగరాల్లో ఈ అల్ట్రా వెల్తీ పర్సన్ల సంఖ్య అత్యధికంగా బెంగళూరులో 17.1 శాతంతో 352కి చేరుకుంది. ఢిల్లీ (12.4 శాతం, 210), ముంబై (9 శాతం, 1,596) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)