దేశంలో 2,528 కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కొత్త కేసులు 3వేలకు దిగువనే నమోదవుతున్నాయి. నిన్న 6 లక్షల మందికి పైగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 2,528 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోపక్క మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముందురోజు ఆ సంఖ్య 60గా ఉండగా.. 24 గంటల వ్యవధిలో 149కి చేరింది. కేరళ గణాంకాలు సవరిస్తుండటమే ఈ భారీ వ్యత్యాసానికి కారణం. ఇక ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 30వేల దిగువకు చేరి.. మొత్తం కేసుల్లో 0.07 శాతానికి క్షీణించాయి. నిన్న 3,997 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.24 కోట్లు(98.73 శాతం) దాటాయి. మరోపక్క దేశంలో టీకా కార్యక్రమం దశలవారీగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకూ 180.9 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. నిన్న 15.7 లక్షల మంది టీకా తీసుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)