భారతీయులను తరలించేందుకు 130 రష్యా బస్సులు

Telugu Lo Computer
0


ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా రష్యా దళాలు భారీ ఎత్తున క్షిపణి దాడులు చేస్తున్నాయి. దీంతో జనావాసాలపైనా ప్రభావం కనిపిస్తోంది. రష్యా దాడుల భయంతో ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. భారతీయుల సహా అక్కడున్న విదేశీయులు స్వదేశాలకు చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల సహా విదేశీయులను ఉక్రెయిన్ నుంచి వెలుపలికి తరలించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో తరలింపు చర్యల కోసం 130 బస్సులు ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ లోని ఖార్కివ్, సుమీ నగరాల నుంచి విదేశీయులను రష్యాలోని బెల్గోరోడో ప్రాంతానికి బస్సుల ద్వారా తరలించనున్నారు. అక్కడి నుంచి విదేశీయులు తమ దేశాలకు వెళ్లొచ్చు. భారత్ ఇప్పటివరకు ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరీల మీదుగా విద్యార్థులను తరలిస్తూ వస్తోంది. ఇంకా ఉక్రెయిన్ లో చాలామంది భారత విద్యార్థులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. రష్యా తాజా నిర్ణయంతో వారందరూ క్షేమంగా ఉక్రెయిన్ దాటే అవకాశముంది.

Post a Comment

0Comments

Post a Comment (0)