మీరు చిన్న సైజ్ అంబానీ కదా ?

Telugu Lo Computer
0


దర్శకరత్న దాసరి నారాయణరావు తో కలసి వినోద్ కుమార్ అలాగే యమున జంటగా వచ్చిన మామగారు సినిమా ఎంత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ మంచి ఫామ్ లో దూసుకుపోతున్న వినోద్ కుమార్ ఉన్నట్టుండి వెండితెరకు దూరం కావాల్సి వచ్చింది. సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వినోద్ కుమార్ తన సినిమాలతో మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి హాజరై తన జీవిత, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అలీ.. వినోద్ కుమార్ ని చూస్తూ తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో నటించారు. అలాగే ఆస్తులు కూడా బాగా కూడబెట్టినట్టి ఉన్నారు. మీరు చిన్న సైజ్ అంబానీ కదా అని అడిగాడు. వినోద్ కుమార్ మాట్లాడుతూ చిన్న సైజు అంబానీ అయితే ఇక్కడ ఉండే వాడిని కాదు ఎక్కడో లండన్ లో ఉండే వాడిని.. ఇక అందరి లాగే నేను సంపాదించాను.. కానీ నాకు అవసరం వున్న అంత డబ్బు మాత్రమే సంపాదించాను అంటే మీకు లాగే నేను కూడా సంపాదించాను. ఇక అలా సినిమా షూటింగ్ సమయంలో దర్శక నిర్మాతలతో హీరోయిన్ల తో ఎలా ఉండేవాడు ఇలా అన్ని విషయాలను కూడా సరదాగా పంచుకున్నారు విజయ్ కుమార్. వీరికి సంబంధించి ప్రోమో విడుదల కాగా త్వరలోనే ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)