బుక్ మై షో ద్వారా టికెట్లు అమ్మకూడదని డిసైడ్

Telugu Lo Computer
0

 


పవన్ కళ్యాణ్, రానా నటించిన మల్టీస్టార్ సినిమా భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మార్కెట్ భారీగా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో నుంచే సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బుక్ మై షో ద్వారా టికెట్లు అమ్మకూడదని డిసైడ్ అయ్యారు భీమ్లా నాయక్ డిస్ట్రిబ్యూటర్. నైజాం డిస్ట్రిబ్యూటర్ నిర్ణయంతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక్క థియేటర్‌లో కూడా బుక్ మై షో ద్వారా టికెట్లు అమ్మకూడదని డిసైడ్ అయ్యారు. బుక్ మై షో కారణంగా ప్రేక్షకుల మీద ఎక్కువ అదనపు భారం పడుతోందని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఈ విషయం మీద కొద్దీ రోజుల క్రితం సునీల్ నారంగ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ బుక్ మై షో కారణంగా ప్రేక్షకుల మీద అదనపు భారం పడుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణలో టికెట్ రేట్లు భారీగా పెరిగిపోగా.. దానికి బుక్ మై షో కమిషన్ కలిపితే రేటు ఇంకా పెరుగుతోంది. అందుకని కౌంటర్ సేల్ చేస్తే బెటర్ అని నిర్ణయించారు. బుక్ మై షో యాజమాన్యం వసూలు చేసే సర్వీస్ ఛార్జి, సినిమా ప్రకటనలు రేట్లు తగ్గించే విధంగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయం సెటిల్ అయ్యేవరకు థియేటర్ కౌంటర్లో టికెట్స్ విక్రయించాలని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)