మార్కెట్‌కు నేనే కింగ్ అనుకున్నవాళ్లు జైల్లో ఉన్నారు

Telugu Lo Computer
0


సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన రియల్ ఎస్టేట్ సదస్సులో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ప్రసంగిస్తూ స్టాక్ మార్కెట్‌కు లీడర్ అంటూ ఎవరూ ఉండరని, మార్కెట్ మాత్రమే రారాజు అని  అన్నారు. మార్కెట్‌కు తామే రాజులము అనుకున్న వాళ్లు ఇప్పుడు ఆర్థర్ జైలులో ఉన్నారన్నారు. వాతావరణం, మరణం, మహిళ, మార్కెట్‌ను కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేరన్నారు. ఇవి అంచనాలకు అందనివి అన్నారు. మార్కెట్‌దే ఎప్పుడు పై చేయి అని వ్యాఖ్యానించారు. రాజు ఎప్పుడూ ఒక్కడేనని, అది మార్కెట్ అన్నారు. భారత్‌కు సమయం రాబోవడం లేదని, ఇప్పటికే వచ్చేసిందన్నారు. 2025-26 నాటికి భారత జీడీపీ పది శాతం వృద్ధిని సాధిస్తుందని అంచనాలు ఉన్నాయని, మార్కెట్ కూడా మహిళ వంటిదేనని, మనలను నిర్దేశిస్తుందని, అనిశ్చితి, ఊగిసలాటలకు గురి అవుతుందన్నారు. మహిళ పైన, మార్కెట్ పైన అజమాయిషీ చేయలేమన్నారు. బ్లూచిప్ కంపెనీలతో పోలిస్తే రియాల్టీ అభివృద్ధి సంస్థలు తమ పెట్టుబడిపై అతి తక్కువ ప్రతిఫలాన్ని పొందుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు రాకేష్. అందుకే ఆయా కంపెనీలని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయవద్దన్నారు. అఫోర్డబుల్ ఇళ్ల అభివృద్ధిదారులు మాత్రమే తాము విక్రయించే పరిమాణం ఆధారంగా స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ ప్రయత్నించవచ్చునని తెలిపారు. కొన్ని సంస్థలు మాత్రమే ఎక్స్చ్ంజీల్లో నమోదు కావడం గమనించవచ్చునని తెలిపారు. డీఎల్ఎఫ్ వంటి షేర్ రూ.1300 నుండి రూ.80కి పడిపోయిందని, ఈ రంగంలో నష్టభయం ఎక్కువ అని అభిప్రాయపడ్డారు. నేను కనుక డెవలపర్‌ను అయితే స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయనని చెప్పారు. బ్లూచిప్ స్టాక్స్ పెట్టుబడిపై 18 శాతం నుండి 25 శాతం ప్రతిఫలం అందిస్తుండగా రియాల్టీ రంగంలో 6 శాతం నుండి 7 శాతం మాత్రమే వస్తుందన్నారు. రియాల్టీ రియాల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అసెట్ క్లాస్ పైన ఇన్వెస్టర్లు బుల్లిష్‌గా ఉన్నారని, ఐటీ, ఫార్మా రంగాల మాదిరి ఈ విభాగం కూడా రాణించవచ్చునని చెప్పారు. 2006లో ఇంటి కొనుగోలు కోసం రాకేష్ తన పోర్ట్‌పోలియోలో క్రిసిల్ షేర్లను రూ.20 కోట్లకు విక్రయించారు. అప్పుడు వాటిని విక్రయించకుండా ఉంటే కనుక రూ.1000 కోట్లు ఉండేదని చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)