సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ చిత్తూరు నగరానికి చెందిన కవిత బ్యాంకు ఖాతాలో నగదు కాజేసిన సైబర్‌ నేరగాళ్లను చిత్తూరు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఆదివారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తూరు రెండో పట్టణ సీఐ యుగంధర్‌ నిందితులను చూపి వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన కవితశ్రీ గతేడాది సెప్టెంబరు 12న గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసింది. ఏజెన్సీ సిబ్బంది సిలిండర్‌ను ఇంటికి తెచ్చి నగదు అడగ్గా ఆమె గూగుల్‌పే నంబరుగా వారు నంబరు చెప్పారు. ఆ నంబరును పొరపాటుగా నమోదు చేసుకున్న ఆమె రూ.950 నగదు ఇతర నంబరుకు పంపింది. ఆ నంబరు వ్యక్తికి ఫోన్‌ చేసినా స్పందన లేదు. నంబరు సైబర్‌ నేరగాడిదని గుర్తించలేక అతడి సూచన మేరకు డెస్కు రిమోట్‌ కంట్రోల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించగా అతడి మాట నమ్మి అలానే చేసింది. వెంటనే నేరస్థుడు ఆమె ఖాతా నుంచి రెండుసార్లు రూ.52వేలు కాజేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రత్యేక బృందం రంగంలోకి దిగి.. పశ్చిమబంగలోని తూర్పు మిడ్నాపూర్‌ జిల్లా గంగాధర్‌చక్‌లో ఉన్న మహేష్‌ దస్బార్‌ గ్రామానికి చెందిన అజారుద్దీన్‌, షఫీఉల్ల హుసేన్‌ను నేరానికి పాల్పడినట్లు గుర్తించింది. ఆదివారం చిత్తూరులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆ ఇద్దరినీ అరెస్టు చేసి విచారించగా నిజాలు ఒప్పుకొన్నారు. వారి నుంచి ఓ ఏటీఎం కార్డు, రూ.50 వేలు నగదు స్వాధీనం చేసుకున్నాం' అని సీఐ చెప్పారు. కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్సైలు మల్లికార్జున, లోకేష్‌, సిబ్బంది గోవిందరావు, జయచంద్ర, ధరణి, శివకుమార్‌ను అభినందించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)