డ్యూటీలో కుప్పకూలిన నర్సు

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బాళేహెణ్ణూరులో నివాసం ఉంటున్న టీకే. గానవి (22) అనే యువతి శివమొగ్గ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. సాఫ్ట్ నర్సుగా మంచి ఉద్యోగం చేస్తున్న టీకే గానవి ఆమె పని చేస్తున్న ఆసుపత్రిలో రోగులను చాలా శ్రద్దగా చూసుకుంటున్నది. తాను నర్సు అనే ఫీలింగ్ లేకుండా ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులతో ఆ స్టాఫ్ నర్సు గానవి కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటున్నది. ఆసుపత్రిలో నర్సు గానవి విధుల్లో ఉంది అంటే సాటి నర్సులు కూడా హ్యాపీగా ఉంటారని తెలిసింది. చూడటానికి చాలా అందంగా ఉంటున్న నర్సు గానవికి మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. నర్సు గానవి కుటుంబ సభ్యుల ఆశలు మొత్తం తల్లకిందులు అయ్యాయి. ఆసుపత్రిలో విధుల్లో ఉన్న నర్సు గానవి కుప్పకూలిపోయింది. వెంటనే నర్సు గానవికి చికిత్స చేసినా ఫలితం లేకుండా ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 22 ఏళ్లకే ఈ లోకం వదిలి వెళ్లిపోయిన నర్సు గానవి అవయవాలు మొత్తం ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)