డేరా బాబాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత!

Telugu Lo Computer
0


డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఖలిస్థానీ తీవ్రవాదులు టార్గెట్ చేశారనే వార్తల నేపథ్యంలో అతనికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు. అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా నిర్దారణ అయి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న డేరా బాబా ఇటీవలే పెరోల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు. అతని ప్రాణాలకు ఇప్పుడు ముప్పు పొంచి ఉన్న దరిమిలా భద్రత కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులిచ్చింది. మాజీ జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య, డేరా ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం కేసులో రామ్ రహీమ్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఐదేళ్లుగా ఆయన రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఉంటున్నాడు. 21 రోజుల పెరోల్ మంజూరు కావడంతో ఫిబ్రవరి 7న జైలు నుంచి విడుదలయ్యాడు. సరిగ్గా పంజాబ్ ఎన్నికల సమయంలోనే డేరా బాబా బయటికి రావడంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత దక్కడం విమర్శలకు మరింత ఊతమిచ్చినట్లయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)