కత్తితో ఓ రౌడీషీటర్ హల్‌చల్

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ టోలీచౌకిలో కత్తితో ఓ రౌడీషీటర్ హల్‌చల్ చేశాడు. సోదరుడి మృతితో అతని స్నేహితులపై కక్ష పెంచుకున్న రౌడీషీటర్‌ ఖాజా ఫరీదుద్దీన్‌ రాత్రి వారు తారసపడటంతో వెంబడించాడు. బంజారాహిల్స్‌లో వేగంగా బండి నడిపి వాహనదారులను ఢీకొట్టాడు. వాహనదారులు వెంబడించడంతో టోలీచౌకి వైపు పరారయ్యాడు. టోలీచౌకిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై దాడికి యత్నించాడు. ఈ క్రమంలో రౌడీషీటర్‌ను పట్టుకునేందుకు పోలీసుల యత్నించగా పారిపోయాడు. రౌడీషీటర్‌ను పోలీసులు, స్థానికులు వెంబడించగా... ఓ ప్రైవేటు ఆస్పత్రిలోకి దూరాడు. ఐసీయూలో రోగి మెడపై కత్తిపెట్టి తప్పించుకునేందుకు యత్నించాడు. చాకచక్యంగా రౌడీషీటర్‌ ఖాజా పరీదుద్దీన్‌ను పోలీసులు పట్టుకున్నారు. గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఖాజా ఫరీదుద్దీన్‌పై కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)