శరవేగంగా ఘాటురోడ్డు నిర్మాణం

Telugu Lo Computer
0


ఆర్మూర్‌ నవనాథ సిద్ధుల గుట్ట ఘాట్‌ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం గతంలో ఉన్న ఘాట్‌ రోడ్డును 30 నుంచి 40 ఫీట్ల వెడల్పుతో విస్తరిస్తున్నారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో పనులు వేగంగా చేపడుతున్నారు. తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే బండరాళ్లు పేర్చారు. మొరం వేయడం పూర్తయింది. ప్రస్తుతం సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గుట్టపైకి ఒకవైపు రోడ్డు నిర్మాణం పూర్తయింది. మరోపక్క పనులు చేస్తున్నారు. ఆలయ కమిటీ, ఘాట్‌ రోడ్డు నిర్మాణ కమిటీ, స్థానిక ప్రజా ప్రతినిధులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. మహాశివరాత్రి నాటికి అందుబాటులోకి వస్తుందని ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఏనుగు శేఖర్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం శివాలయానికి భక్తులు చేరుకునేందుకు ఉన్న దారిని విస్తరిస్తూ ఆలయ కమిటీ మెట్ల మార్గాన్ని నిర్మిస్తోంది. ఇందుకోసం రూ.4 లక్షలు వెచ్చించారు. ఆర్మూర్‌ బల్దియా ఆధ్వర్యంలో రూ.10 లక్షల నిధులతో గుట్టపై మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే భక్తులు, పిల్లల కోసం పార్కును నిర్మించారు. దీని అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. సుందరీకరణ పనులు, కొత్త ఆటపరికరాలు, మొక్కలు పెంచితే భక్తులు, చిన్నారులు ఆహ్లాదంగా గడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)