నేటితో ముగియనున్న సహస్రాబ్ది ఉత్సవాలు

Telugu Lo Computer
0


తెలంగాణలోని ముచ్చింతల్ ప్రాంతంలో సమతా మూర్తి రామానుజాచార్యుల విగ్రహాం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అక్కడ సమతా మూర్తి వెయ్యి ఏళ్ల ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ సహస్రాబ్ది వేడుకులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 2 వ తేదీ నుంచి ప్రారంభం అయిన సమతా మూర్తి సహస్త్రాబ్ది వేడుకలు.. 12 రోజుల పాటు కొనసాగాయి. నేడు చివరి రోజు కావడంతో సమతా మూర్తి కేంద్రంలో ప్రత్యేక పూజు చేయనున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నట్టు సమాచారం. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు సహస్ర కుండలాల యజ్ఞానికి మహా పూర్ణహుతి పలుకనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రానున్నట్టు తెలుస్తుంది. అనంతరం 11:30 గంటలకు రామానుజాచార్యుల బంగారు విగ్రాహానికి ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు. అలాగే సాయంత్రం 5 గంటలకు 108 ఆలయాల్లో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. కాగ నిన్న సమతా మూర్తి కేంద్రంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ హాజరు అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)