ప్రీ డయాబెటిక్ - లక్షణాలు

Telugu Lo Computer
0


మధుమేహరోగులు ముందుగా ప్రీ డయాబెటిక్ దశను దాటే డయాబెటిక్‌గా మారుతారు. ప్రీ డయాబెటిక్ గా ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి బారిన పడాల్సిన బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఆహార నియమాలు, వ్యాయామాల ద్వారానే డయాబెటిక్ రాకుండా అడ్డుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ దశలో కొన్ని రకాల లక్షణాలను శరీరం బయటపెడుతుంది. వాటిని గమనించి షుగర్ టెస్టు చేయించుకోవాలి. అందులో వచ్చే ఫలితాన్ని బట్టి మీరు ప్రీ డయాబెటిక్ కాదో వైద్యులే చెబుతారు. చెవుల నుంచి కాళ్ల వరకు వివిధ ప్రదేశాలలో దద్ధుర్లు వస్తుంటాయి. ఆ దద్దర్లు కూడా రకరకాలుగా ఉంటాయి. చర్మం గట్టిపడినట్టు అవుతుంది. చేతుల వెనుక భాగంలో మందంగా మారుతుంది. ఇది తరచూ టైప్ 1 డయాబెటిస్ రోగులలో కనిపిస్తుంది. చర్మం పొలుసుల మాదిరిగా మారుతుంది. లేత గోధుమ రంగు మచ్చలు వస్తాయి. కాలు కింద భాగంలో దద్దుర్లు వస్తాయి. ప్యాచెస్ లాంటి ఎర్రని మచ్చలతో మధ్యలో పసుపు రంగులో ఉంటాయివి. ఇవి అధికంగా మహిళల్లో కనిపిస్తాయి. చర్మానికి గాయం అయ్యాక అది తగ్గకుండా పెద్దగా మారడం. డయాబెటిక్ న్యూరోపతి ఉన్న రోగులలో అధికంగా చేతులు, పాదాలు, కాళ్లు, ముంజేతుల నొప్పి, వాటిపై పొక్కులు వస్తుంటాయి. దద్దుర్లు కాకుండా ప్రీ డయాబెటిస్ ముఖ్య లక్షణాలు మరికొన్ని ఉన్నాయి. మోచేతులు, మోకాలు, చంకలు, పిడికిలి, మెడ వంటి ప్రాంతాల్లో చర్మం రంగు మారడం వంటివి కూడా డయాబెటిస్ రావడానికి ముందు సంకేతం. అలాగే చూపు మసకగా మారడం, ఆయాసం, దాహం అతిగా వేయడం, రాత్రిళ్లు తరచూ మూత్రానికి పోవడం,  చిన్న దెబ్బ తగిలినా అది త్వరగా తగ్గక పోవడం. ఈ లక్షణాలు కనిపించినా తేలికగా తీసుకోకండి. ఇవన్నీ కూడా ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ రోగులలో ముందస్తు లక్షణాలు.


Post a Comment

0Comments

Post a Comment (0)