యూరప్‌ను వణికిస్తున్నయూనిస్ తుఫాన్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 19 February 2022

యూరప్‌ను వణికిస్తున్నయూనిస్ తుఫాన్ !


యూరప్‌లో యూనిస్ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణికిపోతున్నది. గంటకు 196 కిమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. గాలులు వేగంగా వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తులు గాలులు ధాటికి రోడ్డుపైనే పడిపోతున్నారు. ఇక ఈ ఈదురుగాలులకు విమానాలు ఊడిపోతున్నాయి. పైకప్పులు ఎగిరిపోతున్నాయి. యూరప్‌లో ఎటు చూసినా ఇప్పుడు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తుఫాన్ ధాటికి ఇప్పటికే సుమారు 9 మంది మృతి చెందారు. భారీ వృక్షాలు నేలకొరిగాయి. కరెంటు వైర్లు తెగిపడిపోవడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు ఏర్పడ్డాయి. యూనిస్ తుఫాన్ కారణంగా అనేక దేశాల్లోని తీర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

No comments:

Post a Comment