రోల్స్ రాయిస్ ని ఎలక్ట్రిక్ వాహనంగా మార్చాడు!

Telugu Lo Computer
0


అమెరికాలోని రిచ్‌మండ్‌కు చెందిన 'విన్సెంట్ యు' అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల కఠోర శ్రమ తరువాత తన 'రోల్స్ రాయిస్‌' ను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చారు. దీని కోసం ఆయన తన గ్యారేజ్, నేలమాళిగలో కొన్ని వందల గంటల పాటు శ్రమించారు. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన పరికరాలు కొనుగోలు చేయడానికి కెనడా,యూఎస్, జపాన్, జర్మనీ దేశాలు తిరిగారు. అలాగే విన్సెంట్ యు పరికరాలు కొనుగోలు చేయడం కోసం తన ఇంటిని కూడా అమ్ముకున్నాడు. ఈ కారణంగా అతని భార్య అతన్ని విడిచిపెట్టింది. ఇన్ని ఒడిదుడుకుల మధ్య అతను విజయం సాధించారు. తన రోల్స్ రాయిస్ కారును విజయవంతంగా ఎలక్ట్రానిక్ వాహనంగా మార్చాడు. అతనికి తన EV కన్వర్టర్ వ్రైత్‌పై అతను చాలా గర్వంగా ఉన్నాడు. అతని ప్రకారం అతని కారు ఒక సారీ ఛార్జ్ చేస్తే 331 మైళ్లు (500 కి మీ) ప్రయాణించగలదు. ఈ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు CAD 8 (రూ.475) మాత్రమే, దీనిలో ఉన్న ట్యాంక్‌ను గ్యాసోలిన్తో నింపడానికి అయ్యే ఖర్చు CAD 120(7000) దీంతో పోలిస్తే ఛార్జ్ చేయడం చాలా తక్కువ. ఈ కారును మార్చే ఆలోచనను తన పెద్ద కుమార్తె సూచించిందని చెప్పుకోచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)