ఈ అందాల భామ ఎవరో తెలుసా? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 13 February 2022

ఈ అందాల భామ ఎవరో తెలుసా?


ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ టేబుల్ వద్ద గ్లామర్ ఉట్టిపడింది. ఐపీఎల్ ఆక్షన్ లో అందరిని ఆకర్షించిన ఆ అందాల భామ ఎవరో కాదు జాహ్నవి మెహతా జూహీ చావ్లా ముద్దుల కూతురు. తనతో పాటు కోల్ కతా ఫ్రాంచైజీ సహ యజమాని షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్, కుమార్తె సుహానా కూడా వేలం ప్రక్రియకు హాజరయ్యారు. అయితే వీరిద్దరినీ మించి ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. కాస్త చామనఛాయగా ఉన్న ఆ అందాల కలువ పేరు జాహ్నవి మెహతా. జాహ్నవి అందాల నటి జూహీ చావ్లా ముద్దుల తనయ. జూహ్లీ జావ్లా, జై మెహతాల గారాలపట్టి. ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన జాహ్నవి 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. జాహ్నవి ఐపీఎల్ వేలంలో పాల్గొనడం ఇదేమీ తొలిసారి కాదు. రెండేళ్ల కిందట కూడా ఆటగాళ్ల వేలంలో తళుక్కుమంది. సారి తన తల్లి జూహీ చావ్లా తోడు లేకుండానే కోల్ కతా నైట్ రైడర్స్ వేలంలో ఎంతో చురుగ్గా వ్యవహరించింది. కేకేఆర్ ఫ్రాంచైజీ సీఈఓ వెంకీ మైసూర్ పర్యవేక్షణలో తమ జట్టు కోసం కొనుగోళ్లు జరపడంలో జాహ్నవి కూడా తన వంతు పాత్ర పోషించింది. ఇవాళ్టి వేలంలో కెమెరాలు పలుమార్లు ఆమె వైపే ఫోకస్ చేశాయంటే అతిశయోక్తి కాదు.


No comments:

Post a Comment