మీ బెదిరింపులకు భయపడం

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. విద్యుత్ సంస్కరణల పేరుతో మోదీ పంచాయితీ చేస్తున్నారన్నారు. 'ప్రతి మోటార్ కు మీటర్ పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేసింది… నన్ను చంపినా నేను అమలు చేయనని చెప్పాను' అని కేసీఆర్ గుర్తు చేశారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు.. ఇప్పుడేమో రైతుల పెట్టుబడి డబుల్ అయిందన్నారు' అని విమర్శించారు. జనగామ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 'మోదీ మీరేం చెప్పినా సరే కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టం' అని తేల్చి చెప్పారు. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయబోమని స్పష్టం చేశారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. తమ రాష్ట్రాన్ని పట్టించుకునే వారినే అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. అడ్డగోలుగా డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని మండిపడ్డారు. మనం పండించే ధాన్యం కొనబోమని చెప్తున్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంలో రైతులు, పేదల వెంబడి పడ్డారని పేర్కొన్నారు. లక్షల కోట్లు మింగినవారిని టికెట్టు కొనిచ్చి విదేశాలకు పంపారని విమర్శించారు. లక్షల కోట్ల కుంభకోణాలు చేసినవారిని లండన్ పంపుతున్నారని ఆరోపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలు విదేశాలకు వెళ్లారని తెలిపారు. దేశంలో పెద్ద రాష్ట్రాల కంటే ముందున్నామని తెలిపారు. దేశం కోసం అవసరమైతే కొట్లాడాలన్నారు. ఇది తెలంగాణ.. పులిబిడ్డ..మీ ఉడత ఊపులకు.. పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కేంద్రంపై తిరగబడతాం… కొట్లాడతామని చెప్పారు. అవసరమైతే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తామన్నారు. జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించాలని పేర్కొన్నారు. దేశం గురించి కొట్లాడేందుకు వెనకాడబోమని చెప్పారు. ఢిల్లీ కోటను బద్దలు కొట్టడానికైనా తాను సిద్ధమన్నారు. మేం మంచివాళ్లం.. మిమ్మల్ని ఏమీ అనం..కానీ మమ్మల్సి ముట్టుకుంటే నశం.. నశం చేస్తాం' జాగ్రత్త అంటూ బీజేపీ శ్రేణులను హెచ్చరించారు. తమ బలం, తమ శక్తి ముందు మీరెంత, తాము ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు.. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్ యుద్ధం చేసిన గెలిచిన పార్టీ, వందల మంది బలిదానం చేసిన పార్టీ, రాష్ట్ర సాధన కోసం ఎంత దూరమైన కొట్లాడిన పార్టీ.. మీ ఉడత బెదిరింపులకు భయపడేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)