ట్రూ కాలర్ కి ఎలా తెలుస్తుంది.?

Telugu Lo Computer
0


ట్రూ కాలర్" ఈ రోజుల్లో ఈ యాప్ లేని ఫోన్ లేదనే మాట వాస్తవం. ఆండ్రాయిడ్ ఫోన్ లకు అయితే ఈ యాప్ తప్పనిసరి. ఆండ్రాయిడ్ ఫోన్ లకు సెక్యూరిటీ తక్కువ కాబట్టి ఈ తరహా యాప్ లు వాడకుండా ఉండటం మంచిది అని సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇదెలా ఉంటే ఇప్పుడు ఈ యాప్ గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు ఈ యాప్ కు మనం ఎవరు చేసారో తెలిసిపోతుంది. ట్రూకాలర్ యాప్ ను మనం మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసే సమయంలో మన ఫోన్ బుక్ లేదా కాంటాక్టులను యాక్సెస్‌ను అగ్రీ చేయమని అడుగుతుంది. అది లేకపోతే మన ఫోన్ లో యాప్ తన పని చేయదు. మనం ఓకే కొట్టిన వెంటనే డేటాను యాప్ కంపెనీ సర్వర్‌లలోకి వెంటనే అప్‌లోడ్ చేస్తుంది. మనకు ఎవరైనా ఆన్ నోన్ నెంబర్ నుంచి ఇన్ కమింగ్ కాల్ వచ్చినపుడు ఈ యాప్ తన డాటాబేస్ లో ఉండే డేటా మ్యాచింగ్/రిఫైనింగ్ అల్గారిథమ్‌లను పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆన్ నోన్ నెంబర్ పేరును వెతికి వినియోగదారుడి మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)