వ్యక్తిపై హంసలు దాడి ? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 February 2022

వ్యక్తిపై హంసలు దాడి ?


ఓ వ్యక్తి చెరువు లాంటి చిన్న కొలనులో ఈత కొడుతున్నాడు.అందులో రెండు నల్లటి హంసలు ఉన్నాయి. ఆ వ్యక్తిని చూసి హంసలు అతడి వైపు దూసుకొచ్చి.. అతడిపై దాడి చేశాయి. అవి దాడి చేయడం గమనించిన ఆ వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి తెగ ప్రయత్నించాడు. ఏమాత్రం ఆలస్యం చేసినా.. ఆ హంసలు అతడిని నీళ్లలో ముంచి చంపేసేవే. వేగంగా ముందుకు ఈదుకుంటూ వెళ్లి ఆ వ్యక్తి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ బిడ్డా.. ఇది మా అడ్డ.. అన్నట్టుగా హంసలు అతడిపై దాడి చేయడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. హంసలు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. అక్కడ హంసల గూడు ఉందట. ఆ గూడును అతడు ఏమైనా చేస్తాడేమో అని భయపడి అవి దాడి చేసినట్టుగా కొందరు కామెంట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment