తెలంగాణలో భారీగా విద్యుత్​ డెవలప్ మెంట్ ఛార్జీలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 February 2022

తెలంగాణలో భారీగా విద్యుత్​ డెవలప్ మెంట్ ఛార్జీలు


తెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు వేస్తున్న డెవలప్ మెంట్ చార్జీలు భారంతో చుక్కలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు డిస్కంలు నష్టాల్లో ఉండటంతో చార్జీలు పెంచే యోచనలో యంత్రాంగం ఉంది. ఇప్పటికే డిస్కంలు ఏఆర్ఆర్​లను రెగ్యులేటరీ కమిటీకి అందజేశాయి. వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సామాన్య జనంపై వేల కొద్దీ భారం విధించడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కొవిడ్​కారణంగా ఉద్యోగాలు కోల్పోయి ఎంతో ఆర్థిక భారాన్ని ప్రజలు ఎదుర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కొంత మెరుగవుతున్న క్రమంలో డెవలప్​మెంట్ చార్జీల పేరిట భారీ మొత్తంలో వసూలు చేయడంతో వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. గృహాల్లో విద్యుత్ ను వినియోగించే కెపాసిటీ ఆధారంగా డెవలప్​మెంట్​ చార్జీలు ఉంటాయి. కొత్తగా ఇండ్లు నిర్మించుకునే వారు సాధారణంగా అప్పటి అవసరాలకు తగినట్లుగా 1 కిలోవాట్​కోసం మాత్రమే దరఖాస్తు చేసుకుంటారు. ఎందుకంటే నిర్మాణ సమయంలో వారు వినియోగించుకునే విద్యుత్​తక్కువగా ఉంటుంది. 1 కిలోవాట్​ అంటే 1000 వాట్లకు సరిపడ విద్యుత్​ వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ పరిధిని మించితే మరో కిలోవాట్​కు డెవలప్​మెంట్ చార్జీలను అధికారులు విధిస్తారు. ఆ చార్జీల ద్వారా ట్రాన్స్​ఫార్మర్లపై లోడ్​ పడకుండా ఉండేందుకు ఖర్చు చేస్తారు. ఒక ఇంట్లో టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జి, మిక్సీలాంటి యంత్రాలను వినియోగించినా ఒక కిలోవాట్​సామర్థ్యానికి మించి వినియోగించలేరు. అదే ఏసీ లాంటి భారీగా విద్యుత్ ​వినియోగించే యంత్రాలు ఎక్కువ లోడ్​ను వినియోగించుకుంటాయి. కాబట్టి ట్రాన్స్​ఫార్మర్లపై లోడ్​ పెరిగిపోయి కరెంట్​ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంటుంది. విద్యుత్​ అధికారులు రెండు కేటగిరీల కింద విభజించి ఒక్కో కిలోవాట్​కు ఒక్కో చార్జీ విధిస్తోంది. డొమెస్టిక్ వినియోగానికి ఒక రేటు ఉంటే కమర్షియల్ ​వాడకానికి మరో రేటును ఫిక్స్​ చేసింది. డొమెస్టిక్ ​పరిధిలో ఒక కిలోవాట్​ సామర్థ్యానికి ఫీజుగా రూ.1000గా నిర్ణయించారు. దీనికి అదనంగా జీఎస్టీ ఉంటుంది. అన్నీ కలిపి రూ.1400 ఖర్చవుతుంది. అదే కమర్షియల్​ పరిధిలో అయితే రూ.2000 ఉంటుంది. దీనికి అదనంగా జీఎస్టీ ఉంటుంది. డొమెస్టిక్​లో 2 కిలోవాట్లకు రూ. 2800 అయితే కమర్షియల్​లో రూ.5000 ఖర్చవుతుంది. ఇలా వినియోగదారుల విద్యుత్​ వాడకాన్ని బట్టి అధికారులు రేట్ ​ఫిక్స్ ​చేశారు. అయితే 20 కిలోవాట్ల సామర్థ్యాన్ని మించితే ట్రాన్స్ ఫార్మర్లపై లోడ్​ పడకుండా ఉండేందుకు సొంతంగా ట్రాన్స్​ఫార్మర్​పెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

No comments:

Post a Comment