గఫారీ ఆచూకీ తెలిపితే రూ. 75 కోట్ల బహుమతి !

Telugu Lo Computer
0


ఐసిస్‌-కె అగ్రనేత షనాల్లా గఫారీపై భారీ నజరానా ప్రకటించింది అమెరికా. గతేడాది కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన దాడిలో ప్రధాన సూత్రధారి అయిన గఫారీ ఆచూకీ తెలిపిన వారికి 75 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ దేశ రివార్డ్​ఫర్ జస్టిస్ విభాగం తెలిపింది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని తెలపవచ్చని ట్వీట్ చేసింది. 2021 ఆగష్టులో తాలిబన్లు అఫ్ఘాన్‌ను ఆక్రమించుకుంది. అయితే అమెరికా తమ పౌరులు, అధికారులను తరలిస్తుండగా…ఆగష్టు 26న కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 185 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. అందులో 18 మంది అమెరికా సిబ్బంది కూడా ఉన్నారు. దీంతో దాడికి కుట్ర చేసింది గఫారీ అని గుర్తించారు. గత ఏడాది నవంబర్‌లో గ్లోబల్‌ టెర్రర్‌గా ప్రకటించింది అమెరికా. షనాల్లా 1994లో అఫ్ఘానిస్తాన్‌లో జన్మించాడు. హక్కానీ నెట్‌వర్క్‌లో మొదట పనిచేశాడు. ఆ తర్వాత ఐసిస్‌లో చేరాడు. 2020లో ఐసిస్‌-కేకు అల్ ముజాహిర్‌గా నియమించింది ఉగ్రవాద సంస్థ. ఆ తర్వాత ఐసిస్‌-కేకు గఫారీ కీలక నేతగా మారాడు. గెరిల్లా యుద్ధ తంత్ర, ఆత్మహుతి దాడులు ప్లాన్ చేయడంలో గఫారీ దిట్ట. అఫ్ఘాన్‌ వ్యాప్తంగా అర్బన్‌ లయన్స్‌గా వీరిని పిలుస్తారు. ముఖ్యంగా దాడులకు పాల్పడటం, నిధులు సేకరించడం వీరి ఆధీనంలో ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)