60 ఏళ్ల కూలీ సోషల్ మీడియా స్టార్ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 February 2022

60 ఏళ్ల కూలీ సోషల్ మీడియా స్టార్ !


కేరళలోని కొడివల్లికి చెందిన మమ్మిక్కా ఓ సాధారణ కూలీ. ఒక సాదాసీదా షర్ట్ వేసుకొని, లుంగీ కట్టుకొని అదే ప్రాంతంలో తిరిగే ఓ మామూలు మనిషి. కానీ ఈ మమ్మిక్కా ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయిపోయాడు. తనను మోడల్‌గా పెట్టి కేరళకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్.. ఫోటోషూట్ చేశాడు. ఆ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షరీక్ వయాలీల్ అనే ఫోటోగ్రాఫర్ ఒకసారి మమ్మిక్కా ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి విపరీతంగా లైకులు వచ్చాయి. అంతే కాకుండా మమ్మిక్కా కొంచెం యాక్టర్ వినాయకన్‌లాగా ఉన్నాడన్న కామెంట్స్ కూడా వచ్చాయి. అప్పుడే షరీక్‌కు ఒక ఐడియా వచ్చింది. మమ్మిక్కాను మోడల్‌గా పెట్టి ఓ ఫోటోషూట్ చేయాలని, అనుకున్నట్టుగానే ఫోటోషూట్ పూర్తి చేశాడు. ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. మమ్మిక్కా మేక్ ఓవర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు సాధారణంగా కనిపించే మమ్మిక్కా ఇంత స్టైలిష్‌గా కూడా ఉండగలడా అని కామెంట్ చేస్తున్నారు. స్టైలిష్ సూట్, చేతిలో ఐప్యాడ్ లుక్ మమ్మిక్కాను సోషల్ మీడియా స్టార్‌ను చేసేసాయి. 60 ఏళ్ల వయసున్న మమ్మిక్కా సినీ పరిశ్రమలోని చాలా మంది సీనియర్ నటులకు పోటీ ఇవ్వగలడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment