ఈ నెల 25న భీమ్లా నాయక్ విడుదల

Telugu Lo Computer
0


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 25 వ తేదీన భీమ్లా నాయక్ సినిమా ను విడుదల చేయాలని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. ఈ ఏడాది జనవరి నెలలో సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి, థర్డ్ వేవ్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు. మంగళ వారం రాత్రి భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. కాగ భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు రానా కలిసి నటిస్తున్నారు. అలాగే నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగ అయ్యాప్పన్ కోశియమ్ అనే మలయాళ హిట్ సినిమాను తెలుగు లో భీమ్లా నాయక్ గా తెరకెక్కించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)