ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 February 2022

ఫిబ్రవరి 21న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌?


భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఫిబ్రవరి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని నిర్ణయించారు. తెలంగాణ నుంచి మంత్రులు కేటీఆర్, తలసాని ముఖ్య అతిథులుగా రానున్నట్లు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మేకపాటి ఆకస్మిక మరణంతో ఈవెంట్ ను వాయిదా వేసారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా, ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయనేది ఫిలిం నగర్ టాక్. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడినా.. ట్రైలర్ మాత్రం అనుకున్నట్లుగానే విడుదల చేశారు. ఇందులో పవర్‌ఫుల్ డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తించాయి.

No comments:

Post a Comment