ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌ వేరియంట్ !

Telugu Lo Computer
0


ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రభావం ఉంటుందని పేర్కొన్న డబ్ల్యూహెచ్‌వో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య చాలా తక్కువని, ఒమిక్రాన్‌ మరణాలు కూడా తక్కువేనని పేర్కొంది. ఇప్పటికే ఒమిక్రాన్‌  వేరియంట్ 128 దేశాలకు వ్యాపించిందని చెబుతోంది. ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికీ కోవిద్ 19 రోగులకు 14 రోజుల ఐసోలేషన్‌ను సిఫార్సు చేస్తోంది. చాలా మంది కోవిడ్‌ బాధితులు ఐదు నుండి ఏడు రోజులలోపు వైరస్‌ నుంచి కోలుకుంటారు.. అయితే, రాష్ట్రాలు వారి వ్యక్తిగత పరిస్థితుల ఆధారంగా ఐసోలేషన్‌ వ్యవధిపై నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెబుతోంది. తక్కువ ఇన్‌ఫెక్షన్లు ఉన్న దేశాలలో, ఎక్కువ కాలం ఐసోలేషన్‌తో వీలైనంత తక్కువ కేసులు నమోదు కావడానికి సహాయపడుతుందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం డిసెంబర్ 29, 2021 నాటికి, దాదాపు 128 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.. ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కంటే ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందనే పేర్కొంది. అధిక-ప్రమాదకర వ్యక్తులు మరియు టీకాలు వేసుకోనివారు ఇప్పటికీ ఆ వేరియంట్ నుండి తీవ్ర అనారోగ్యానికి గురువుతున్నారని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కొన్ని వారాల వ్యవధిలో ఇతర జాతులను అధిగమించగలదని చెబుతున్నారు. ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లో ప్రధానంగా టీకాలు తీసుకోనివారే ఆ మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపింది. డెన్మార్క్‌లో ఆల్ఫా వేరియంట్‌ కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి రెండు వారాలు పట్టిందని, అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ కేవలం రెండు రోజుల్లోనే విస్తరించిందని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)