థైరాయిడ్ రోగులు తినాల్సిన పండ్లు !

Telugu Lo Computer
0


స్త్రీలతో పాటు పురుషుల్లోనూ థైరాయిడ్ రోగులుంటారు. శరీరంలోని దాదాపు అన్ని జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేసే హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లలో హెచ్చు తగ్గులు ఏర్పడినప్పుడు హైపో థైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడ్‌కి గరవుతుంటారు. దాంతో ఉన్నట్టుండి బరువు తగ్గడం లేదా పెరగడం, మెడ వాపు, గొంతు నొప్పి, మలబద్ధకం, చేతులు కాళ్లు చల్లబడిపోవడం, నీరసం, ఆందోళన, అలసట, లైంగిక కోరికలు తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి లోపించడం ఇలా థైరాయిడ్ కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమస్యలను నివారించుకోవాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వారు ఖచ్చితంగా కొన్ని పండ్లను తినాలి. సీజనల్ ఫ్రూట్స్‌ను థైరాయిడ్ రోగులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే, కమలా పండ్లలో ఉండే విటమిన్ సి మరియు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ థైరాయిడ్ గ్రంథి పని తీరును పెంచుతాయి. అదే సమయంలో థైరాయిడ్ వల్ల వచ్చే మలబద్ధకాన్ని నివారిస్తాయి. జ్ఞాపక శక్తిని రెట్టింపు చేస్తాయి. మరియు రోగ నిరోధక వ్యవస్థను సైతం పటిష్టం చేస్తాయి. థైరాయిడ్ ఉన్న వారు తీసుకోవాల్సిన మరో పండు పైనాపిల్‌. దీనిలో ఉండే విటమిన్ బి మరియు ఇతర పోషకాలు థైరాయిడ్ రోగుల్లో నీరసం, అలసట వంటి సమస్యలను నివారిస్తాయి. శరీర బరువును అదుపులోకి తెస్తాయి. మరియు పైనాపిల్ తినడం వల్ల చేతులు, కాళ్లు చల్ల బడటం కూడా తగ్గుతుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, గూస్బెర్రీ వంటి వాటిని తరచూ తీసుకోవాలి. బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందు వల్ల, బెర్రీ పండ్లను డైట్‌లో చేర్చుకంటే అవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. అదే సమయంలో థైరాయిడ్ వ్యాధి కారణంగా వచ్చే సమస్యలను నివారిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)