ట్విట్టర్ లో మొరగడం తప్ప, పీకేదేమిలేదు !

Telugu Lo Computer
0


సినిమా టికెట్ల వ్యవహారం పై నిన్న టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. సినిమాలు తీసుకునే అమ్ముకుంటే… ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఏంటని  వర్మ, పేర్ని నానిని  ప్రశ్నించారు. దీనిపై తాజాగా కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో సినిమాలు తీసుకుంటూ… తమ ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మేం ఒక నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు అయినా ఆడి చెంచా గాళ్ళు అయినా ట్విట్టర్ లో మొరగడం తప్ప పీకేది ఏంలేదని అన్నారు. దమ్ముంటే సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గకుండా ఆపండని కొడాలి నాని సవాల్ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టాక్స్ పే చేసేవారికి, ఇక్కడ జీవించే వాళ్ళకి మాత్రమే గవర్నమెంటును అడగడానికి నైతిక హక్కు కలిగి ఉంటారని, ఎవరైనా సరే పక్క రాష్ట్రాల్లో బతుకుతున్నోల్లు ఎటువంటి ప్రశ్నలు వేయడానికి అర్హత లేదని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)