రామకృష్ణ తల్లి, సోదరి అరెస్ట్‌

Telugu Lo Computer
0


భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క లీలా మాధవిలను కొత్తగూడెంలో పాల్వంచ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అక్కడి నుంచి ఖమ్మం సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులు ప్రధాన నిందితుడు రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను పాల్వంచ పోలీసులు కొత్తగూడెంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా న్యాయమూర్తి రాఘవకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు మధ్య రాఘవను భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు. అనంతరం జైల్లో రాఘవకు రిమాండ్‌ ఖైదీ నెం.985 సంఖ్యను కేటాయించారు. ప్రత్యేక సబ్‌జైల్లోని బ్యారక్‌ నెం.1లో అతడిని ఉంచారు. వాస్తవానికి రాఘవను ఖమ్మం జిల్లా జైలుకు తరలించాల్సి ఉండగా ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో అతడిని భద్రాచలం ప్రత్యేక సబ్‌జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. త్వరలో మళ్లీ అతడిని ఖమ్మం జైలుకు తరలిస్తారని ప్రచారం జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)