వీకెండ్ కర్ఫ్యూలో లిక్కర్ షాపులకు అనుమతిలేదు !

Telugu Lo Computer
0


దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, మరి కొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ కర్ఫ్యూ కూడా అమలవుతోంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ వీకెండ్ కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. వీకెండ్స్‌లో కర్ఫ్యూ అమలు నేపథ్యంలో అత్యవసర సేవలు, నిత్యావసరాలు మినహా అన్నీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తప్పనిసరి అవసరాలు ఉంటేనే జనం బయటకు రావాలని సూచించింది. అయితే ఈ క్రమంలో వీకెండ్స్‌ కర్ఫ్యూ అమలులో ఉండే రోజుల్లో ఇకపై లిక్కర్‌ సేల్స్‌ను నిలిపేయాలని నిర్ణయించినట్లు కర్ణాటక ఎక్సైజ్ మినిస్టర్ కే గోపాలయ్య తెలిపారు. ఈ మేరకు ఎక్కడా లిక్కర్ షాపులు ఓపెన్ చేయనీయకుండా, సేల్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని గోపాలయ్య తెలిపారు. తమ షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని లిక్కర్ షాపుల ఓనర్లు కోరారని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పబ్లిక్‌ను బయటకు రాకుండా అడ్డుకునేందుకు వాళ్ల విజ్ఞప్తిని పక్కనబెట్టామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)