ప్రైవేట్ బస్సుల సీజ్! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 14 January 2022

ప్రైవేట్ బస్సుల సీజ్!


సంక్రాంతి సందర్భంగా అనధికారికంగా ట్రావెల్స్ నడుస్తున్నాయి. కొన్నింటికీ పర్మిట్లు ఉండగా.. మరి కొన్నింటికీ అవీ కూడా లేవు. అనుమతి లేకుండా ప్రయాణికులను చేరవేస్తున్న ప్రైవేట్ బస్సులపై ఆర్టీవో అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట రింగ్ రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని మూడు ప్రైవేట్ బస్సులపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుధ్ధంగా తిరుగుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు. శంషాబాద్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు పాటించని ఆరు ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతులు లేకుండా బస్సులు నడిపితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కానీ ఎప్పటిలాగే తిప్పుతున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల ఇంటి వద్దకే సేవలందించేదుకు రెడీ అయ్యింది. సంక్రాంతికి ఊరు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే.. వారి ప్రాంతం, వారి కాలనీకి బస్సును పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందుకోసం ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో గల ప్రయాణికులకు ఈ సదుపాయం కల్పిస్తున్నామని ట్వీట్ చేశాపారు. సమచారం కోసం ఎంజీబీఎస్ : 9959226257, జేబీఎస్ : 9959226246, రేతిఫైల్ బస్ స్టేషన్ 9959226154, కోఠి బస్ స్టేషన్ : 9959226160 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సంక్రాంతి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఊరికి వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. జనవరి 7 నుంచే బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 15 వరకు స్పెషల్‌ బస్సులను తిప్పనున్నట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. సంక్రాంతికి మొత్తం 4వేల 318 బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడపనుంది. రాష్ట్రంలోని జిల్లాలకు 3వేల 334 స్పెషల్‌ బస్సులను నడపనుంది. ఇక ఏపీకి మరో 984 సర్వీసులు తిప్పనుంది. ఈసారి చార్జీల విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ కాస్త ఊరట ఇచ్చింది. సాధారణ చార్జీలు తీసుకుంటామని తెలిపిన సంగతి తెలిసిందే. పండుగకు తిప్పే స్పెషల్‌ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. దీంతో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే అవకాశం ఉంది. పండుగ కోసం ఊళ్లకు వెళ్లేవారిని తమ బస్సుల్లో ఎక్కించేలా ఆర్టీసీ ప్లాన్‌ చేసింది. ఏపీకి తిప్పే బస్సుల్లోనూ టీఎస్ఆర్టీసీ సాధారణ చార్జీలే వసూలు చేయనుంది. దీంతో సంక్రాంతి పండుగను కుటుంబంతో జరుపుకోవడానికి సొంతూళ్లకు వెళ్లే ఏపీ ప్రజలు కూడా టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. సంక్రాంతికి అదనపు చార్జీలు వసూల్ చేస్తామని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. దానిని చూస్తే టీఎస్ ఆర్టీసీ మేలే అనిపిస్తోంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ మాత్ర బాదుతున్నాయి.

No comments:

Post a Comment