ఆంధ్రప్రదేశ్ లో మహిళా పోలీసు విభాగం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల కేటగిరీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ హోం శాఖ. ఐదు కేటగిరీలుగా మహిళా పోలీసు విభాగంలో పోస్టులు ఏర్పాటు చేసింది. మహిళా పోలీసు ఇనస్పెక్టర్ నాన్ గెజిటెడ్, మహిళా పోలీసు సబ్ ఇనస్పెక్టర్, మహిళా పోలీసు ఏఏస్ఐ,సీనియర్ మహిళా పోలీసు, మహిళా పోలీసుగా ఉద్యోగ కేటగిరీలు విభజించింది సర్కార్‌. మహిళా పోలీసు విభాగంలో 90 శాతం మేర డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపింది ప్రభుత్వం. మహిళా హోం గార్డులను 5 శాతం మేర, గ్రామవార్డు మహిళా వాలంటీర్ల నుంచి 5 శాతం మందిని మహిళా పోలీసు విభాగంలో భర్తీ చేస్తామని స్పష్టం చేసింది హోంశాఖ. ప్రస్తుతం కొనసాగుతోన్న గ్రామ, వార్డు సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా రీ-డిజిగ్నేట్ చేస్తామని నోటిఫికేషనులో  ప్రభుత్వం స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)