మద్యం తాగే ముందు వీటిని తినండి!

Telugu Lo Computer
0


మద్యం తాగే అలవాటున్న వారు ఎంత చెప్పినా తాగకుండా ఉండలేకపోతున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యం చెడిపోతున్నా కూడా లెక్క చేయడం లేదు. రోజూ ఆల్కహాల్ తాగకుండా ఉండలేని వారు కనీసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారు అవుతారు. మద్యంతాగే కింద చెప్పిన ఆహారాలను తినడం వల్ల మేలు జరుగుతుంది. అప్పటికే కొంత కడుపునిండటం వల్ల తక్కువ తాగుతారు, అలాగే ఆల్కహాల్ వల్ల వెంటనే శరీరంపై పడే ప్రభావాలను ఇవి కొంతమేరకు తగ్గిస్తాయి. ముఖ్యంగా ఉబ్బరం, నిర్జలీకరణం, గుండెల్లో మంట, అజీర్ణాన్ని నివారించడానికి ఇవి సహకరిస్తాయి. గుడ్లులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆల్కహాల్ తాగడానికి ముందే ఉడికించిన గుడ్లను లేదా ఆమ్లెట్‌ను తినేయాలి. దీని వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవించలేరు. అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రెండు అరటిపండ్లు తిన్నాక ఆల్కహాల్ తాగితే అది చేసే హాని ఎంతోకొంత తగ్గుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఏర్పడకుండా అరటి పండు కాపాడుతుంది. రక్తంలోకి ఆల్కహాల్ శోషణ కూడా మందగిస్తుంది. ఆల్కహాల్ తాగిన వెంటనే శరీరం శోషించుకోకుండా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాలీ ఆమ్లాలు, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. సాల్మన్ చేపలో ఇవి అధికంగా ఉంటాయి. కప్పు పెరుగులో ప్రోటీన్లు, మంచి కొవ్వులు, పిండిపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. పెరుగులోని ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. కాబట్టి ఆల్కహాల్ తాగకముందు పెరుగు తినడం వల్ల దాని చెడు ప్రభావాలను తగ్గించుకోవచ్చు. చిలగడదుంపల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ తీసుకునే ముందు వాటిని తినడం వల్ల సంక్షిష్ట కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను నెమ్మదిగా సాగేలా చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)