పెళ్లి వేడుకలో వధువుకు వినూత్న ఆహ్వానం

Telugu Lo Computer
0


మన దేశంలో పెళ్లి వేడుకలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అంగరంగ వైభవంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో సంప్రదాయాలను కూడా పాటిస్తుంటారు. సాధారణంగా వధువును ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పెళ్లి మండపానికి తీసుకొస్తారు. కొన్ని ప్రాంతాల్లో మేనమామ, మరికొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు లేదా సోదరులు కూడా వధువు ను మండపానికి తీసుకొస్తారు. తాజాగా తమ సోదరిని మండపానికి తీసుకెళ్లే క్రమంలో సోదరులు చేసిన పని అందరి గుండెలను పిండేస్తుంది. ఓ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకలో తమ సోదరిపై ఉన్న ప్రేమను తెలిపేందుకు సోదరులు వినూత్న ప్రయత్నం చేశారు. వధువు మండపానికి తీసుకు వెళ్లే మార్గంను మొత్తం పూలతో నింపారు. ఆమె సోదరులు దారి పొడవునా మోకాళ్లపై కూర్చుని తమ అర చేతులను పూల మార్గంపై ఉంచారు. ఆ వధువు సోదరుల అర చేతుల మీద నడుస్తూ మండపానికి చేరుకుంది. వధువు చేతుల మీద నడుస్తుండగా పక్కన వారు పూలు, డబ్బుల వర్షం కురిపించారు. ఆ సమయంలో వధువు చాలా సంతోషపడుతూ మండపానికి చేరుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)