థర్డ్ వేవ్. టీనేజర్ల లక్షణాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 10 January 2022

థర్డ్ వేవ్. టీనేజర్ల లక్షణాలు


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వివిధ రూపాల్లో విజృంభిస్తోంది. మొదటి దశలో కాస్త ఎక్కవగా భయాన్ని కలిగించినప్పటికీ ప్రాణ నష్టాలు కలిగించలేదు. కానీ.. రెండవ దశలో విశ్వరూపం దాల్చింది. అనేక మంది ప్రాణాలను హరించింది. ఇప్పుడు మూడో దశ ఒమిక్రాన్ రూపంలో ప్రళయాన్ని సృష్టించడానికి సిద్దం అవుతోంది. మూడో దశలో కరోనా వైరస్ సోకిన పిల్లలు, టీనేజర్లలో (11-17) తీవ్ర జ్వరం, వణుకుడు వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయని ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌ పీడియాట్రిక్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ధీరేన్ గుప్తా తెలిపారు. రెండేళ్లలోపు చిన్నారుల్లోనూ ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. మరికొందరికి ఆస్పత్రి చికిత్స కూడా అవసరమవుతున్నట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ రోగి శ్వాస వ్యవస్థపై ప్రధానంగా ప్రభావం చూపుతోంది. జలుబు, తలనొప్పి, చలి జ్వరం వంటి లక్షణాలు సర్వసాధారణంగా సంభవిస్తాయని తెలిపారు. కరోనా రెండో దశతో పోల్చితే మూడో దశలో చాలా తక్కువ మంది మాత్రమే రుచి, వాసన కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రతీ పది మందిలో ఇద్దరు లేదా ముగ్గురిలో ఒమిక్రాన్, డెల్టా వైరస్ లక్షణాలు కలిశాయని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి టీకా వేసుకున్న వారిలో ఒకవిధంగా, తీసుకోని వారిలో మరోలా ఉందని గుప్తా తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఇది మరీ తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. న్యుమోనియా ఉన్న కరోనా రోగులకు స్టెరాయిడ్స్ అవరసమవుతున్నాయని తెలిపారు డాక్టర్ గుప్తా.


No comments:

Post a Comment