ఝార్ఖండ్ సీఎం ఇంట్లో కోవిడ్ కలకలం

Telugu Lo Computer
0


ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో కరోనా కలకలం రేపింది. ముఖ్యమంత్రి సతీమణితో పాటు వారి ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పుడీ అంశం ఝార్ఖండ్ లో చర్చనీయాంశంగా మారింది. జాగ్రత్తలు పాటించే సీఎం ఇంట్లోనే కరోనా కేసులు ఈ స్థాయిలో ఉంటే ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనాలకు అందటం లేదు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ముఖ్యమంత్రి, ఆయన సతీమణి కల్పనా సోరెన్, కుమారులు నితిన్, విశ్వజీత్ లతో పాటు ఆయన నివాసంలోని మొత్తం 62 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు కేసులు బయట పడినట్లు తెలుస్తోంది. అయితే వారిలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు స్పష్టం చేశారు. పాజిటివ్ గా తేలిన వారందరికీ స్వల్ప లక్షణాలే ఉండటంతో వారందరూ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)