ముగిసిన రమేశ్​బాబు అంత్యక్రియలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 9 January 2022

ముగిసిన రమేశ్​బాబు అంత్యక్రియలు

అనారోగ్యంతో కన్నుమూసిన సూపర్​స్టార్​ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్​బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్​లోని మహాప్రస్థానంలో రమేశ్ కుమారుడు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా పరిస్థితుల వల్ల అతి కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు రమేశ్​ భౌతికకాయం సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. అక్కడికి కృష్ణ కుటుంబ సభ్యులు సహా నరేశ్​, సుధీర్​బాబు, మంచు విష్ణు, మురళి మోహన్, కోటా శ్రీనివాసరావు, నిర్మాత తమ్మిరెడ్డి భరద్వాజ్​ తదితరులు వచ్చి నివాళులు అర్పించారు. కరోనా సోకడం వల్ల మహేశ్​బాబు రాలేకపోయారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేశ్​ శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 'అల్లూరి సీతారామరాజు' (1974) చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశారు రమేశ్​బాబు. కృష్ణ, మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. సుమారు 15 చిత్రాల్లో ఆయన కీలకపాత్రలో పోషించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. 'అర్జున్‌', 'అతిథి' సినిమాలు నిర్మించారు.

No comments:

Post a Comment