యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు మినహాయింపు

Telugu Lo Computer
0


దేశవిదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ భారత్‌కు చేరుకున్న తర్వాత కరోనా పరీక్ష చేయించుకోవాలని, హోం క్వారంటైన్ పాటించాలని ఆంక్షలు విధించారు. అయితే ముంబై ప్రభుత్వం ఇందులో కీలక మార్పు చేసింది. యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులను వీటి నుంచి మినహాయిస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు విషయాన్ని గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా తెలిపింది. 'యూఏఈ నుంచి వచ్చే ప్రయాణికులకు ఇకపై ఎటువంటి ప్రత్యేక ఎస్ఓపీ పరీక్షలు అవసరం లేదు. దుబాయ్ ప్రయాణికులు కూడా ఈ మినహాయింపు కేటగిరీలోకి వస్తారు' అని అధికారులు తెలిపారు. ఇది జనవరి 17 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చినట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)