పెరగనున్నఈపీఎఫ్ఓ మినిమం పెన్షన్ ?

Telugu Lo Computer
0


ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారులకు మినిమమ్ పెన్షన్ పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా జరుగుతున్న చర్చల ఫలితంగా . ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించి మినిమమ్ పెన్షన్ పెంపు అంశంపై త్వరలోనే ఈపీఎఫ్ఓ తమ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల కనీస పెన్షన్ ను భారీగా పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ కనీస పెన్షన్ పెంపు అంశంపై చర్చ జరగవచ్చునని అంటున్నారు. ఉద్యోగుల ఎప్పటినుంచో ఈ కనీస పెన్షన్ ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఖాతాదారులకు కనీస పెన్షన్ పెంచే ప్రతిపాదనలపై ఫిబ్రవరిలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జరపనున్న చర్చల్లో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ కనీస పెన్షన్‌ పెంపు పై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత 2021 మార్చిలోనే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పెంచాలని సిఫార్సు చేసిన సంగతి విదితమే. 

Post a Comment

0Comments

Post a Comment (0)