ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనలపై నిషేధం విధించింది. వైశ్యులను కించపరించే విధంగా ఉన్న ఈ నాటక ప్రదర్శన లను నిషేధించాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చేసిన విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఎక్కడా ఈ నాటక ప్రదర్శనలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా ఈ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు. తెలుగు నాటక రంగంలో చింతామణికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. కాగా ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, శ్రీహరి, భవానీ శంకరం తదితర కీలక పాత్రలు ఉన్నాయి . అయితే నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర చింతామణి అనే స్త్రీ వ్యామోహంలో పడి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్యులు ప్రభుత్వానికి విన్నవించారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇకపై ఎక్కడా చింతామణి నాటకం ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)