చంద్రయ్య హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టిడిపి నేత చంద్రయ్య హత్య కేసులో   మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించిన వివరాల ప్రకారం పాత కక్షలతో ఈ హత్య జరిగినట్లుగా పేర్కొన్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించామని పేర్కొన్నారు. చంద్రయ్య కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నాలుగు బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టి 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. చంద్రయ్య బైక్ పై వెళ్తున్న సమయంలో ఆపి నిందితులు కత్తులతో దాడి చేసినట్లుగా ఉదయం 7గంటల నుంచి ఏడున్నర గంటల మధ్యలో హత్య జరిగినట్లుగా ఎస్పీ తెలిపారు.మృతుడు తోట చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు చింతా శివరామయ్య గుండ్లపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, మూడేళ్ల క్రితం చంద్రయ్యకు, శివరామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్ విషయంలో గొడవలు జరిగాయని ఎస్పీ విశాల్ గున్నీ పేర్కొన్నారు. అప్పటి నుంచి వారి మధ్య మొదలైన కక్షలు మళ్లీ ఇటీవల కాలంలో బయటపడ్డాయని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)