తాజా మాంసాన్ని గుర్తించడం ఎలా? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 6 January 2022

తాజా మాంసాన్ని గుర్తించడం ఎలా?


మనిషి తీసుకునే ఆహారంలో అధిక పోషకాహారంగా మాంసాహారాన్ని చెప్పవచ్చు. సగటు మనిషి ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఏడాదికి 70 కిలోల మాంసం ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటున్నట్లు అంచనా. జనాభా పెరుగుతున్న నేపధ్యంలో వారి అవసరాలకు తగినట్లు మార్కెట్లో మాంసం ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ క్రమంలోనే మాంసం విక్రయాలు పారిశ్రామిక స్ధాయికి ఎదిగాయి.  ప్రస్తుత పరిస్ధితుల్లో మాంసాహారం లేకుండా ముద్ద దిగని పరిస్ధితి నెలకొంది. దీంతో మాంసం విక్రయాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో మాంసం కొనుగోలు చేసే ముందు దాని యొక్క నాణ్యత విషయంలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. చాలా మంది సరైన నాణ్యత లేని, ఎక్కవ కాలం నిల్వవున్న మాంసాన్ని విక్రయిస్తున్నారు. దీని వల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. మాంసం దుకాణానికి వెళ్ళినప్పడు మనం కొనుగోలు చేసే మాంసం నాణ్యమైనదా , కాదా అన్న విషయాన్ని ముందుగా పరిశీలించుకోవాలి. దుకాణదారుడు విక్రయాలు సాగిస్తున్న ప్రదేశంలో శుభ్రత ఏవిధంగా ఉందో గమనించాలి. మాంసం దుకాణ దారుని యొక్క ఆరోగ్య పరిస్ధితులను గమనించాలి. ఎందుకంటే అనారోగ్య పరిస్ధితుల్లో ఉండి శుభ్రత పాటించకుండా ఉంటే అలాంటి చోట కొనుగోలు చేయకపోవటమే మేలు. మాంసం మరీ గట్టిగా కాకుండా మృధువుగా ఉంటే తాజా మాంసంగా గుర్తించాలి. లేత మాంసం గులాబి రంగులో ఉంటుంది. ముదురు మాంసం ఎరుపు రంగులో ఉంటుంది. కొవ్వు తెలుపురంగులో ఉంటుంది. మాంసం ముక్కను చేతి వేలితో నొక్కితే తిరిగి నొక్కిన చోట మాంసం యాధాస్ధితికి రాకుంటే అది తాజా మాంసం కాదని గుర్తించాలి. మాంసం ముక్క అంచుల్లో నల్లటి చారలు కనిపిస్తే సరిగ్గా భద్రపరచకుండా మనకు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్ధం. కొంతమంది మాంసం విక్రయదారులు గొర్రె,  మేక మాంసాల విక్రయంలో వినియోగదారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తుంటారు. మగజీవాల వృషణాలను తొలగించి, వాటిని ఆడమేక, ఆడ గొర్రెల కు తగిలించి పొట్టేలు, పోతుగా చెప్పి నమ్మిస్తారు. ప్యాకింగ్ మాంసాన్ని స్టోర్స్ లో కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా దాని యొక్క గడువుతేదిని పరిశీలించి మాత్రమే తీసుకోవాలి. గడువు తీరిన మాంసాన్ని కొనుగోలు చేయకూడదు. మాంసాన్ని 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ఫ్రిజ్ లో 5 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. 10 డిగ్రీల సెంటీగ్రేట్ వద్ద నెలరోజుల వరకు నిల్వకు అవకాశం ఉంటుంది. 4 నుండి 6 మాసాలు భద్రపరుచుకునేందుకు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవటం ఉత్తమం. అదే వండిన మాంసాన్ని 4రోజుల వరకు రిఫ్రిరిజిరేటర్ లో దాచుకోవచ్చు. మాంసం కొనుగోలు చేసే సమయంలో కాళ్లు, భుజాలు, పక్క భాగాలు వంటివి కాకుండా నడుము, తుంటి వంటి వెనుక భాగాల్లోని మాంసాన్ని తీసుకోవాలి. జీవాలకు సంబంధించిన లేత మాంసం ఎరుపు రంగులో ఉంటుంది. కొవ్వు కొద్ది పరిమాణంలో మాత్రమే ఉంటుంది. అదే ముదురు జీవాలైతే దాని మాంసం బాగా ఎర్రటి ఎరుపు రంగులో ఉండి కొవ్వు పసుపు, బూడిద రంగుల్లో ఉంటుంది. సాధ్యమైనంత వరకు లైసెన్సు, రిజిస్ట్రేన్ షాపుల్లో కొనుగోలు చేయటం ఉత్తమం. 

No comments:

Post a Comment