90 ఏళ్లుగా అక్వేరియంలో జీవించి ఉన్నచేప ?

Telugu Lo Computer
0


సాధారణంగా చేపలు ఎంతకాలం జీవిస్తాయి అంటే ఖచ్చితంగా చెప్పలేం. భూమిపై అత్యథిక కాలంపాటు జీవించే చేపలు తిమింగళాలు అని చెప్పవచ్చు. అయితే, ఇవి సముద్రంలో జీవిస్తుంటాయి. కానీ, అక్వేరియంలో జీవించే చేపలు ఎంతకాలం జీవిస్తాయి అనే విషయంలో ఖచ్చితమైన వయస్సు నిర్ధారణ ఉండదు. అయితే, శాన్ ఫ్రాన్సిస్కోలోని అక్వేరియంలోని మెసెతులె అనే చేప 90 ఏళ్ల నుంచి అక్వేరియంలో జీవించి ఉన్నది. లంగ్ ఫిష్ జాతికి చెందిన ఈ చేప 4 అడుగుల పొడవు, 40 పౌండ్ల బరువు ఉందని చెబుతున్నారు. లంగ్ ఫిష్‌కు జాతికి చెందిన చేపలను అరుదైన చేపలుగా గుర్తించారు. ఆస్ట్రేలియా నుంచి 1938దీనిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి జాగ్రత్తగా పెంచుతున్నారట. జీవించియున్న అక్వేరియం చేపల్లో అత్యంత పెద్దదైన చేప ఇదేనని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చేప ఆరోగ్యంగా ఉందని, ప్రతిరోజూ తాజా అంజీరాలను పెడతామని చెబుతున్నారు అక్వేరియం నిర్వాహకులు.


Post a Comment

0Comments

Post a Comment (0)