అమెరికాలో ఒక్కరోజే 10 లక్షలకు పైగా కేసులు

Telugu Lo Computer
0


అమెరికాలో గత కొద్ది వారాలుగా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారీ కోవిడ్ కేసుల్లో అమెరికా ప్రపంచ రికార్డు సృష్టించింది. సోమవారం ఒక్కరోజే అమెరికాలో 10లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల క్రితం యూఎస్ లో 5లక్షల 90వేల కేసులు ఒక్కరోజులో నమోదుకాగా..అదే ఇప్పటివరకు యూఎస్ లో రికార్డుగా ఉండింది. అయితే దీనికి రెట్టింపు సంఖ్యలో సోమవారం 10లక్షలకు పైగా కోవిడ్ కేసులు యూఎస్ లో నమోదయ్యాయి. అయితే నూతన సంవత్సర వేడుకలు, వరుస సెలవులే అగ్రరాజ్యంలో ఈ స్థాయిలో కేసులు పెరగడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ లెక్కల ప్రకారం 100 మంది అమెరికన్లలో ఒకరు వైరస్‌ బారిన పడ్డారు. అమెరికాలో ఇప్పటివరకు 8.26లక్షలకు పైగా మంది కోవిడ్ తో చనిపోయినట్లు జాన్‌ హాప్కిన్స్‌ డేటా తెలిపింది. మరోవైపు, కోవిడ్ కేసుల పెరుగుదలతో అమెరికాలో హాస్పిటల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నాయి. 2021 జనవరిలో అత్యధికంగా 1.42లక్షల మంది హాస్పిటల్ పాలవ్వగా.. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో హాస్పిటల్స్ లో చేరికలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో లక్ష మందికి పైగా హాస్పిటల్స్ లో కోవిడ్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇక,కోవిడ్ సునామీ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 62శాతం మంది అమెరికన్లు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరికి బూస్టర్‌ డోసులను కూడా పంపిణీ చేస్తున్నారు. చిన్నారులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)