పీటల మీదే పెళ్లి కూతురును లాగి.. ..!

Telugu Lo Computer
0


సాధారణంగా ఏ పెళ్లిలో అయినా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బుద్ధిమంతుల్లా ఉంటారు. పెళ్లి చేసే పంతులు ఏం చెబితే అది చేస్తారు. జిలకర్రబెల్లం పెళ్లి కూతురు తల మీద పెట్టడం దగ్గర్నుంచి తాళి కట్టడం వరకు పెళ్లి కొడుకు పంతులు ఏది చెబితే అది చేస్తాడు. కానీ.. ఓ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లి పీటల మీదే రెచ్చిపోయాడు. పెళ్లికూతురును అమాంతం తనవైపు లాక్కొని ముద్దుల వర్షం కురిపించాడు. తనతో లిప్ లాక్ చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి పీటల మీద పక్కనే బంధువులు ఉన్నా పంతులు ఉన్నా పట్టించుకోకుండా.. ఆ పెళ్లి కొడుకు.. పెళ్లికూతురుకు ముద్దు పెట్టాడు. తన పెదాలను అస్సలు వదలకుండా అలాగే ముద్దు పెడుతుండటంతో పెళ్లి కూతురు కూడా అతడికి సపోర్ట్ చేసి అతడి భుజాల మీద చేతులు వేసింది. దీంతో పెళ్లికొచ్చిన బంధువులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)