కుక్కలను ఎత్తుకెళ్లి భవనాలపై నుంచి పడేస్తున్న కోతులు. ..! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 19 December 2021

కుక్కలను ఎత్తుకెళ్లి భవనాలపై నుంచి పడేస్తున్న కోతులు. ..!


మనుషులకే కాదు జంతువులకు కూడా పగలు ప్రతీకారాలు ఉంటాయని ఈ ఘటనతో తెలుస్తోంది. తమ కోతిని కుక్కలు చంపేశాయని కుక్కలపై కోతులు పగబట్టాయి. దొరికిన కుక్కలను ఎత్తుకెళ్లి భవనాలపై నుంచి పడేసి చంపేస్తున్నాయి. ఇలా నెల రోజుల వ్యవధిలో 250కి పైగా కుక్కపిల్లలను కోతులు చంపేసి పగ తీర్చుకున్నాయి. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మాజల్‌గావ్‌లో జరుగుతున్న ఈ ప్రతీకారం సంచలనం సృష్టిస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఓ కోతి పిల్లను కుక్కలు వెంటాడి దానిని చంపేశాయి. దాంతో అప్పటి నుంచి కుక్కలపై కోతులు పగబట్టాయి. ఏదైనా కుక్కపిల్ల కనిపిస్తే చాలు దాన్ని ఎత్తుకుపోయి భవనంపై నుంచో, చెట్ల పై నుంచో కిందపడేసి వాటిని చంపేస్తున్నాయి. దాంతో స్థానికులు భయపడుతున్నారు. తాము పెంచుకుంటున్న కుక్కపిల్లల్ని బయటకు వదలకుండా జాగ్రత్త పడుతున్నారు. కొన్ని కుక్కలను ప్రజలు రక్షించేందుకు ప్రయత్నించగా కోతులు వారిపై కూడా దాడి చేశాయి. దాంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.


No comments:

Post a Comment