కాకరకాయ - ఔషధ గుణాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 17 December 2021

కాకరకాయ - ఔషధ గుణాలు


కాకర కటిక చేదుగా ఉన్నప్పటికీ పుష్కలమైన వైద్య గుణాలను కలిగి ఉంది. కాకరకాయ జ్వరాన్ని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. నులిపురుగులను సైతం నశింపజేయగల ఔషధంగా పనిచేస్తుంది. కాకరకాయను వీలైనంత ఎక్కువగా అంటే రోజు విడిచి రోజు ఆహారంలో తింటుంటే రక్తప్రసరణ చక్కగా జరిగి, తద్వారా కొవ్వు కరిగి శరీరం నాజూకుగా ఉండేందుకు తోడ్పడుతుంది. వారంలో ఒకసారి బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే ఆకలి పెరిగి, అజీర్ణం తగ్గుతుంది. అలవాటు తక్కువగా ఉన్నవాళ్ళు మెల్లగా కాకరకాయను కూరగా అలవాటు చేసుకుంటుంటే అందులో రుచి పెరుగుతుంది. అందులో ఉన్న ఔషధగుణాలతో ఆరోగ్యం మెరుగవుతుంది. కాకర కాయలో బీ, సి విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫాస్పరస్‌ వంటి ధాతువులు ఉన్నాయి. మనం తినే ఆకు కూరల్లో ఉన్న క్యాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా క్యాల్షియం వుంటుంది. కాకరకాయ జ్యూస్‌ను రోజూ తాగితే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. కాకరకాయ జ్యూస్‌ను రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగడం వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయులు కంట్రోల్‌ అవుతాయి. కాకరకాయ జ్యూస్‌లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్‌లా పనిచేస్తాయి. అందువల్ల షుగర్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. కాకర కంటి శుక్లం, దృష్టి లోపం వంటి సమస్యల నివారిణిగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్‌ 'ఎ' కళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అతిసార, నులిపురుగులు, గజ్జి, తామర వంటి చర్మవ్యాధులకు కాకర కాయలు ఔషధంగా ఉపయోగపడతాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలెర్జీలు దరి చేరవు. వైరస్, బాక్టీరియాపై పోరాడుతుంది. ముఖ్యంగా మహిళలో వచ్చే గర్భాశయ, రొమ్ము క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని వదిలించుకునేందుకు రోజుకు రెండు సార్లు అరస్పూన్‌ చొప్పున తీసుకుంటే చాలు. ఒక్క కాకర కాయలో బచ్చలికూరలో ఉండే కాల్షియం, ఒక అరటి పండులో ఉండే పొటాషియం ఉంది. కాకర కాయ రసంలో చేదు తగ్గాలంటే కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే మంచిది. కాకర ప్రారంభ దశలో ఉన్న కలరాను దూరం చేస్తుంది. కలరాతో ఏర్పడే వాంతులకు కూడా కాకర కళ్లెం వేస్తుంది. కాకర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటూ వస్తే కంటి సమస్యలు, దృష్టిలోపాలను దూరం చేసుకోవచ్చు. కాకర పండును తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలెర్జీ, చర్మ వ్యాధులు, సోరియాసిస్‌ వంటి వ్యాధుల్ని కూడా కాకర నయం చేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలకు సైతం కాకర దివ్యౌషధంగా పనిచేస్తుంది. కీళ్ళనొప్పులు తగ్గించే గుణం కాకర కాయకు ఉంది. బాధిస్తున్న కీలుమీద కాకరరసాన్ని రాసి నెమ్మదిగా మర్దన చేయాలి.

No comments:

Post a Comment