రైళ్లలో మహిళలకు లోయర్ బెర్త్‌లు కేటాయింపు

Telugu Lo Computer
0


సుదీర్ఘ ప్రయాణాల్లో మహిళలకు అసౌకర్యం కలుగకుండా రైల్వేశాఖ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకొన్నది. మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో స్లీపర్‌ క్లాసులోని ఆరు బెర్తులను మహిళలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తెలిపారు. గరీబ్ రథ్/రాజధాని/దురంతో రైళ్లలో 3ఏ, పూర్తి ఏసీ రైళ్లలో కూడా ఆరు బెర్తులను మహిళలకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో ఒక కోచ్‌కి ఆరు నుండి ఏడు లోయర్ బెర్త్‌లు, ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ (3ఎసి)లో ఒక్కో కోచ్‌కి నాలుగు నుండి ఐదు లోయర్ బెర్త్‌లు మరియు ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ (2ఎసి) క్లాస్‌లలో ఒక్కో కోచ్‌కి మూడు నుండి నాలుగు లోయర్ బెర్త్‌లు రిజర్వేషన్ కోటా కింద కేటాయించినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్‌లు, 45 ఏళ్లు పైబడిన మహిళా ప్రయాణికులు మరియు గర్భిణీ స్త్రీల కోసం కేటాయించామని ఆయన తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)